Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

India beat Canada:
హాకీ పురుషుల జూనియర్ వరల్డ్ కప్ లో ఇండియా నేడు కెనడాపై 13-1 తేడాతో ఘనవిజయం సాధించింది. నిన్న ఫ్రాన్స్ చేతిలో త్రుటిలో విజయం చేజార్చుకున్న ఇండియా జూనియర్లు నేడు తమ విశ్వరూపం ప్రదర్శించారు. ఆట మొదటి నుంచే కుర్రాళ్ళు సంపూర్ణ ఆధిపత్యాన్ని చాటారు. మొదటి పావు భాగం పూర్తయ్యే నాటికి 2-0 తో ఉన్న ఇండియా, ఆట అర్ధ భాగానికి 4-1 ఆధిక్యం సంపాదించింది. మూడో పావు భాగానికి ఈ ఆధిక్యం 7-1కి చేరింది. ఆట చివరి పావు భాగంలో కెనడాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా  మరో ఐదు గోల్స్ సాధించారు.

ఇండియా తరఫున హ్యాట్రిక్ గోల్స్ సాధించిన అరైజీత్ సింగ్ హుండాల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

ఓడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియం వేదికగా జరుగుతోన్న హాకీ పురుషుల జూనియర్ వరల్డ్ కప్ మెగా టోర్నీలో నేడు గురువారం, నవంబర్ 25న జరిగిన మిగిలిన మ్యాచ్ ల్లో…

ఈజిప్ట్ పై అర్జెంటీనా … 14-0 తేడాతో

సౌత్ కొరియాపై నెదర్ల్యాండ్స్ … 12-5 తేడాతో

అమెరికాపై స్పెయిన్ … 17-0 తేడాతో

పోలాండ్ పై ఫ్రాన్స్ … 7-1 తేడాతో విజయం సాధించాయి

Also Read : తొలి మ్యాచ్ లో ఇండియా ఓటమి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com