Saturday, January 18, 2025
HomeTrending Newsబంగ్లాదేశ్ లో లాక్ డౌన్

బంగ్లాదేశ్ లో లాక్ డౌన్

బంగ్లాదేశ్ లో ఈ రోజు నుంచి లాక్ డౌన్ కఠినంగా అమలు చేయనున్నారు. కరోన కేసులు లెక్కకు మించి పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అన్నింటికీ సెలవు ప్రకటించారు. 15 రోజులపాటు విధించిన లాక్ డౌన్ నుంచి అత్యవసర సేవల్ని మినహాయించారు. వారం రోజుల్లోనే 15 శాతం నుంచి 22 శాతానికి కేసులు పెరగటంతో బంగ్లా ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. అంచనాకు మించి కేసులు పెరుగుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ నిర్ణయం వైపు మొగ్గు చూపినట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

చిట్టగాంగ్ ప్రాంతంలో రోహింగ్య శరణార్థి శిభిరాల్లో కరోన కేసులు ఉదృతంగా పెరుగుతున్నాయి. రోహింగ్యాల్లో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతోంది. మయన్మార్ నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన రోహింగ్యాలు ఢాకా, చిట్టాగంగ్, కాక్స్ బజార్ తదితర నగరాల పొలిమేరల్లోని శరణార్థి శిభిరాల్లో తలదాచుకుంటున్నారు. వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న  రోహింగ్య శిభిరాలు లెక్కకు మించి జనాభాతో మురికివాడలను తలపిస్తున్నాయి.

గత వారం ఒకే రోజు ఎనిమిది లక్షల కేసులు రావటంతో బంగ్లా ఆరోగ్య శాఖ లాక్ డౌన్ కు సిఫారసు చేసింది. ప్రధాన  నగరాలు మినహా గ్రామీణ బంగ్లా లో వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. బంగ్లాదేశ్ లాక్ డౌన్ తో భారత్ అప్రమత్తం అయింది. సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేసింది. పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్