Saturday, January 18, 2025
HomeTrending Newsనేటి నుంచి మూడో విడత నామినేషన్లు

నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

లోక్‌సభ ఎన్నికల మూడో విడత నోటిఫికేషన్‌ ఈ రోజు (శుక్రవారం) విడుదలైంది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్‌ స్థానాల్లో నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 19 వరకు నామినేషన్ల దాఖలు… ఏప్రిల్‌ 20న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఆయా స్థానాల్లో మే 7న పోలింగ్‌ జరుగనుంది.

మూడో విడతలో అస్సాం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, దాద్రానగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూ, జమ్ము కశ్మీర్‌, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ లోక్‌సభ నియోజకవర్గానికి కూడా అదే రోజున పోలింగ్‌ జరుగనుంది. రెండో విడతలో బేతుల్ లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. బీఎస్పీ అభ్యర్థి మరణంతో ఎన్నిక వాయిదాపడింది. దీనికి కూడా ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మూడో విడతలో ఎన్నికలు జరిగే నియోజకవర్గాలు

గుజరాత్ లో 26 – కచ్ , బనస్కాంత, పటాన్, మహేసన, సబర్‌కాంత, గాంధీనగర్, అహ్మదాబాద్ తూర్పు, అహ్మదాబాద్ పశ్చిమ, సురేంద్రనగర్, రాజ్‌కోట్, పోర్ బందర్, జామ్‌నగర్, జునాగఢ్, అమ్రేలి, భావ్‌నగర్, ఆనంద్, భరూచ్, బార్డోలీ, సూరత్, నవసారి, వల్సాద్, ఖేదా, పంచమహల్, దాహోద్ వడోదర, ఛోటా ఉదయపూర్

కర్ణాటక : 14 – చిక్కోడి, బెల్గాం, బాగల్‌కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారి, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, దావణగెరె, షిమోగా

మహారాష్ట్ర: 11 – రాయగఢ్, బారామతి, ఉస్మానాబాద్, లాతూర్, షోలాపూర్, మాధా, సాంగ్లీ, సతారా, రత్నగిరి – సింధుదుర్గ్, కొల్హాపూర్, హత్కనాంగ్లే

ఉత్తరప్రదేశ్: 10 – సంభాల్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, ఫిరోజాబాద్, మైన్‌పురి, ఎటా, బదౌన్, ఓన్ల, బరేలీ

మధ్యప్రదేశ్: 08 – మోరెనా, భింద్, గ్వాలియర్, గుణ, సాగర్, విదిష, భోపాల్, రాజ్‌గఢ్

ఛత్తీస్‌గఢ్: 07 – సర్గుజా, రాయ్‌ఘర్, జంజ్‌గిర్-చంపా, కోర్బా, బిలాస్‌పూర్, దుర్గ్, రాయ్‌పూర్

బీహార్: 05 – ఝంఝర్‌పూర్, సుపాల్, అరారియా, మాధేపురా, ఖగారియా

అస్సాం: 04 – కోక్రాఝర్, ధుబ్రి, బార్పేట, గౌహతి

పశ్చిమ బెంగాల్: 04 – మల్దహా ఉత్తర్, మల్దహా దక్షిణ్, జంగీపూర్, ముర్షిదాబాద్

దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ: 02 – డామన్ మరియు డయ్యూ, దాద్రా మరియు నగర్ హవేలీ
గోవా: 02 – ఉత్తర గోవా, దక్షిణ గోవా, జమ్మూ మరియు కాశ్మీర్: 01 – అనంతనాగ్-రాజౌరి

18వ లోక్‌సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతున్నాయి. జూన్‌ 4న ఫలితాలు విడుదలకానున్నాయి. ఇప్పటికే రెండు  దశలకు నోటిఫికేషన్లు విడుదలవగా, నాలుగో విడత ఎన్నికలకు ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ వెలువడనుంది. నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 96 ఎంపీ స్థానాల్లో మే 13న ఎన్నికలు జరుగనున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్