Saturday, April 20, 2024
HomeTrending Newsబ్యాక్ బోన్ తీసేస్తాం: జోగి రమేష్

బ్యాక్ బోన్ తీసేస్తాం: జోగి రమేష్

మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో మరింత సంక్షేమం, అభివృద్ధి ప్రతి గడపకూ చేరే దివ్యమైనదిగా నూతన సంవత్సరం ఉంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ టిడిపికి మాత్రం బూతులు మరింతగా ఎక్కువ ఎలా తిట్టాలనే ఏడాదిగా మారుతుందని చెప్పారు. 2022 వైఎస్సార్ కాంగ్రెస్ విజయనామ సంవత్సరంగా, అభివృద్ధి, సంక్షేమం వెల్లివిరిసిన సంవత్సరంగా ఉందని… కానీ తెలుగుదేశం పార్టీకి బూతు నామ సంవత్సరంగా మిగిలిపోయిందని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో  మీడియాతో జోగి మాట్లాడారు.

సిఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుకు బిసిలు గుర్తుకు రాలేదని మళ్ళీ ఇప్పుడు బిసిలు అంటూ మాట్లాడుతున్నారని  విమర్శించారు. బిసిల పిల్లలు మంచిగా చదువుకోవాలని, ప్రపంచాన్ని చుట్టి రావాలనే ఉద్దేశంతో సిఎం జగన్ వారి చేతుల్లో ట్యాబ్ లు ఇస్తున్నారని… కానీ బాబు మాత్రం వారు ఇంకా కులవృత్తుల్లోనే మిగిలిపోవాలని అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

తనకు మరో ఛాన్స్ ఇవ్వాలంటూ బాబు అడుగుతున్నారని… ఇన్నేళ్ళపాటు బిసిలతో ఊడిగం చేయించుకున్న ఆయనకు ఎందుకు ఇవ్వాలని జోగి ప్రశ్నించారు. తనకు వయస్సు అయిపోలేదని బాబు చెప్పుకుంటున్నారని, అధికారం కోసం అంతగా అర్రులు చాచాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కందుకూరులో ఎనిమిది మంది కార్యకర్తలు చనిపోతే కనీసం 24గంటలు గడవక ముందే మళ్ళీ బహిరంగ సభ పెట్టారని దుయ్యబట్టారు. మరణించిన వారు త్యాగం చేశారని బాబు అంటున్నారని… వారు ఏమైనా స్వాతంత్ర్య పోరాటం కోసం త్యాగం చేసారా?.. మీరు సిఎం సీటులో కూర్చోవడం కోసం వారు త్యాగం చేయాలా అని మంత్రి ప్రశ్నించారు.  ఇప్పటి వరకూ బిసిలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని కానీ వచ్చే ఎన్నికల్లో బిసిలు అందరం కలిసి చంద్రబాబుకు బ్యాక్ బోన్ తీసేస్తామని హెచ్చరించారు. బిసిలకు మేలు చేసేందుకు ఓ చట్టం చేయాలనే ఆలోచన బాబుకు ఎప్పుడూ రాలేదని, దేశంలో బిసి ముఖ్యమంత్రులు  కూడా చేయని విధంగా బిసిలకు మన రాష్ట్రంలో సిఎం జగన్ మేలు చేశారన్నారు.  పాదయాత్ర పేటెంట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ లదేనని… లోకేష్ కు పాదయాత్ర చేసే హక్కు లేదని జోగి అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్