Friday, March 28, 2025
HomeTrending NewsYuva Galam: ఇక యుద్ధం మొదలైంది: నారా లోకేష్

Yuva Galam: ఇక యుద్ధం మొదలైంది: నారా లోకేష్

వైఎస్సార్సీపీ నేతలు దోచుకున్న సొమ్మును వసూలు చేసి వాటిని పేదలకు పంచే బాధ్యతను తెలుగుదేశం, జనసేన పార్టీ తీసుకుంటుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. చలికాలంలోకూడా ఫ్యాన్ కు ఉక్కపోస్తోందని, వైసీపీ ఇటీవల పది కార్యక్రమాలు చేపట్టినా వాటికి ప్రజలు ఏమాత్రం స్పందించలేదని వ్యాఖ్యానించారు. ఇటీవల చేపట్టిన బస్సుయాత్ర తుస్సు యాత్రగా మారిందన్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై కూడా లోకేష్ సెట్టైర్లు వేశారు. ఇప్పటివరకూ చేసింది చాలని ఇంకా అవసరం లేదని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో విరామం ప్రకటించిన యువగళం పాదయాత్రను లోకేష్ నేడు పునరుద్ధరించారు. నాడు నిలిపి వేసిన రాజోలు నియోజకవర్గం  తాటిపాకలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.

  • ఏ తప్పూ చేయని చంద్రబాబును 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారు
  • బాబును నిర్బంధించిన సమయంలో తమకు అండగా ఉన్న ప్రజలకు కృతజ్ఞతలు
  • ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో… దేశ విదేశాల్లో అనేక మంది బాబుకు సంఘీభావం ప్రకటించారు.
  • దేశవ్యాప్తంగా ఎన్నో పార్టీలు, నేతలు కూడా మద్దతు తెలిపారు.
  • బాబుపై పెట్టిన రిమాండ్ రిపోర్ట్ చూస్తే  నవ్వొస్తుంది
  • బాబును జైల్లో బంధించి న్యాయానికి సంకెళ్ళు వేశారు
  • బాబుపై కేసు పెట్టినా ఒక్క రూపాయి అవినీతి సొమ్ము ఉన్నట్లు కూడా నిరూపించలేకపోయారు.
  • టిడిపి కార్యకర్తలు క్రియాశీల సభ్యత్వం తీసుకొని చెల్లించిన నిధులను అవినీతి అని చెబుతున్నారు
  • తనపై కూడా కేసులు పెడితే ధైర్యంగా ఎదుర్కొన్నాను
  • తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి పై కూడా కేసులు పెడతామని హెచ్చరించారు
  • విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం వేస్తున్నారు
  • పాదయాత్రకు 79 రోజులు ఆపినందుకు క్షమాపణలు
  • యువ గళం ఆపేందుకు జగన్ సర్కార్ ఎన్నో కుట్రలు చేసింది
  • ఎన్ని ఆటంకాలు సృష్టించినా యువ గళం ఆగలేదు
  • వంద సంక్షేమ కార్యక్రామాలు ఆపేసిన ఘనత జగన్ దే
  • ఈ పాలనలో దళితులు, మైనార్టీలకు రక్షణ లేదు
  • సీపీఎస్ రద్దు చేస్తామని జీపీఎస్ తీసుకొచ్చి ఉద్యోగస్తులను మోసం చేశారు
  • ఇక యుద్ధం మొదలైంది
  • ఇకపై యువ గళం ఆపేది లేదు
  • పోలీసులు వచ్చినా, పిల్ల సైకోలు వచ్చినా తగ్గేదే లేదు
RELATED ARTICLES

Most Popular

న్యూస్