Saturday, January 18, 2025
HomeTrending Newsమెగా డీఎస్సీ ఫైలుపై లోకేష్ తొలి సంతకం

మెగా డీఎస్సీ ఫైలుపై లోకేష్ తొలి సంతకం

రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రిగా నారా లోకేష్  బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం నాలుగో బ్లాక్ లోని ఛాంబర్ లో తనకు కేటాయించిన రూమ్ నంబర్ 208లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య తన సీటులో కూర్చుని మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలిసంతకం చేసి, కేబినెట్ కు తదుపరి ఆమోదం కోసం పంపారు. ఈ డీఎస్సీ ద్వారా 16347 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసంతకం చేసిన దస్త్రం పైనే సంబంధిత శాఖ మంత్రిగా లోకేష్ సంతకం చేశారు.

లోకేష్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, ఎస్.సవిత, టీజీ భరత్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ వేమూరి రవికుమార్, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, ప్రధాన కార్యదర్శి రవినాయుడు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం, మాజీ ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, ఏఎస్ రామకృష్ణ, బుద్ధా నాగ జగదీష్, అంగర రామ్మోహన్ రావు, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ నాగుల్ మీరా తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్