Wednesday, March 26, 2025
HomeTrending NewsNara Lokesh: రాష్ట్రపతి దృష్టికి బాబు అరెస్టు అంశం

Nara Lokesh: రాష్ట్రపతి దృష్టికి బాబు అరెస్టు అంశం

యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి తప్పుడు కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ విమర్శించారు. ఈనెల 29నుంచి తన యాత్రను పునః ప్రారంభిస్తామని నిన్న చెప్పగానే ఈరోజు తనపై ఔటర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా చేర్చారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్ తన పార్టీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్ లతో కలిసి  భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని, ప్రతిపక్ష పార్టీలపై అణచివేత అంశాలను ఆమెకు వివరించామని లోకేష్ వెల్లడించారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాతో లోకేష్ మాట్లాడిన ముఖ్యాంశాలు.

  • 2019 నుండి ప్రతిపక్ష పార్టీలు, ప్రజలపై రాజకీయ పార్టీలపై దాడుల గురించి రాష్ట్రపతికి వివరించాము.
  • స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో రాజకీయ కక్ష, కేసు నమోదు గురించి మాట్లాడాము.
  • ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలను కేసుల పేరుతో వేధిస్తున్నారని రాష్ట్రపతికి వివరించాము.
  • ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైర్ గ్రిడ్ కేసుల గురించి నాకు సంబంధం లేదు.
  • నా యువగళం పాదయాత్ర ను అడ్డుకోవడానికి తప్పుడు కేసులతో ఇబ్బందులు పెడుతున్నారు .
  • ప్రజా క్షేత్రంలో కి వెళ్లకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
  • ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. న్యాయం ఆలస్యం అవుతుందే తప్ప… న్యాయం తప్పకుండా జరుగుతుంది .
  • సిఐడీ ఆరోపిస్తున్న కంపెనీలతో మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ల దగ్గర కనీసం కప్పు టీ కూడా తాగలేదు.
  • నేను తప్పు చేస్తే ఢిల్లీ కి వచ్చి అరెస్ట్ చేసే ధైర్యం సిఐడీకి లేదా? నేను కేసులకు భయపడి ఢిల్లీలో దాక్కోలేదు.
  • నేను త్వరలోనే ఏపికి వెళ్తాను, యువగళం పాదయాత్ర త్వరలోనే ప్రారంభిస్తాను. అనుమతి కోసం పోలీసులకు అప్లై చేశాము.
  • రేపు మా నేత చంద్రబాబు కేసు సుప్రీంకోర్టు లో ఉంది, ఆ కేసు విచారణ పూర్తయిన తర్వాత నేను ఏపి వెళ్తాను
  • తమ నాయకుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా తెలుగువాళ్లు దేశంలో ఎక్కడైనా ధర్నా చేసుకోవచ్చు, ఆ హక్కు వాళ్లకు ఉంది. సిడ్నీ, లండన్ లో కూడా తెలుగు వాళ్లు ధర్నా ఆందోళన చేసారు. అక్కడ లేని శాంతి భద్రతల సమస్య హైదరాబాద్ లో ఎందుకు ఉంది?
  • 6 నెలల తర్వాత జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. వ్యక్తిగతంగా కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను .
  • టీడీపీ, జనసేన యాత్రలను తట్టుకోలేక రోజుకు ఒక యాత్ర, రోజుకు ఒక కేసు పెడుతున్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్