7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

HomeTrending NewsRahul Gandhi: సామాన్యులతో రాహుల్ గాంధి...మీడియాలో వివక్ష

Rahul Gandhi: సామాన్యులతో రాహుల్ గాంధి…మీడియాలో వివక్ష

ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం కావటం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి నైజం. ఎన్నికల సంవత్సరం కావటంతో రాహుల్ ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్ళినా పనిలో పనిగా సామాన్యులను కలిసి వారి కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు. భారత్ జోడో పాదయాత్రలో కూడా వేల మంది నిస్సహాయులను కలిశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజా సంక్షమమే అజెండాగా విధానాలు రూపొందిస్తామని భరోసా ఇస్తున్నారు.

ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ రైల్వేస్టేషన్‌ను ఈ నెల 21వ తేదీన రాహల్‌ సందర్శించారు. స్టేషన్‌లో రైల్వే కూలీలతో రాహుల్‌ ముచ్చటించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రాహుల్‌ రైల్వే కూలీలాగా ఎర్రటిచొక్కా వేసుకుని, బ్యాడ్జీ ధరించి, మూటలు మోశారు.

జైపూర్‌ మహారాణి కళాశాలలో  ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాహుల్ శుక్రవారం ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. ఆ తర్వాత ఓ అమ్మాయి స్కూటర్‌పై సరదాగా రైడ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతుంది. వీడియోపై రాజస్థాన్ మే జన్ నాయక్ అని ఒకరు, కాబోయే యంగెస్ట్ పీఎం అని ఇంకొకరు వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మేలో రాహుల్ బెంగళూరులో డెలివరీ బాయ్ స్కూటర్‌పై ప్రయాణించారు.

ఏప్రిల్ నెలలో రాహుల్ పంజాబ్ రాష్ట్రానికి రైల్లో సాధారణ బోగీలో ప్రయాణించారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వారి వద్దకే వెళ్లాలని నిర్ణయించిన రాహుల్‌… ఢిల్లీలో సచ్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీ ఎక్కి కూర్చున్నారు. ప్రయాణికులతో ముచ్చటించారు. రైల్లో తనతో పాటు ప్రయాణించిన రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
తాజాగా సోమవారం చత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిరిగొచ్చేటప్పుడు రైలులో ప్రయాణించారు. రాయ్‌పూర్‌కు వెళ్లే క్రమంలో బిలాస్‌పూర్-ఇత్వారీ ఇంటర్‌సిటీ రైలు స్లీపర్ తరగతిలో ప్రయాణించారు. రాహుల్ వెంట ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ బఘేల్ ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్ తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. రైల్లోని హాకీ క్రీడాకారిణులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఖేలో ఇండియా’ ద్వారా అందుతున్న సౌకర్యాల గురించి వాకబు చేశారు.
వీటన్నింటికి సోషల్ మీడియాలో అధ్బుతమైన స్పందన వస్తోంది. ప్రధాన మీడియాలో మాత్రం ఎక్కడా ప్రాధాన్యత లేదు. జాతీయ మీడియా మొక్కుబడిగా ప్రసారం చేస్తుంది. దేశంలో ప్రధాన మీడియా హౌస్ లన్ని బిజెపికే మొదటి ప్రాధాన్యత అనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం టివి చానెళ్ళలో వచ్చే వార్తలను ప్రజలు కూడా నమ్మటం లేదు. స్మార్ట్ ఫోన్ వాడే వారు ఎక్కువగా సోషల్ మీడియానే ఫాలో అవుతున్నారు.
గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గెలవరని… ఎన్నికలు మొదలైన నాటి నుంచి వోటింగ్ పూర్తి అయిన మరుక్షణం సర్వేల్లో కూడా అదే చెప్పారు. ఫలితాలు వచ్చే సరికి బిజెపినే గెలిచింది.
ఇదంతా తెలిసినా బిజెపి నేతలు విపక్షాలను కట్టడి చేసేందుకు చౌకబారు ఎత్తులు ఎందుకు వేస్తున్నారు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు నిభంధనల పేరుతో ఇబ్బందులు పెడితే ఓటు అనే ఆయుధంతో ప్రజలే గుణపాటం చెపుతారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్