Sunday, January 19, 2025
HomeTrending NewsManoj Kumar Jha : లోకమత్ ఉత్తమ పార్లమెంటరీయన్ గా మనోజ్ ఝా

Manoj Kumar Jha : లోకమత్ ఉత్తమ పార్లమెంటరీయన్ గా మనోజ్ ఝా

ప్రముఖ మీడియా సంస్థ లోక్ మత్ ఢిల్లీలో మంగళవారం జాతీయ సదస్సు నిర్వహించింది. సదస్సు అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా  లోకమత్ సంస్థ 2022 సంవత్సరానికి గాను ఉత్తమ పార్లమెంటరీయన్ అవార్డులు ప్రదానం చేసింది. రాష్ట్రీయ జనత దళ్ ఎంపి మనోజ్ ఝా కు మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో న్యూఢిల్లీ కన్వెన్షన్ సెంటరులో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు,లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్,వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి,లోకసభ సభ్యులు బీ.బీ.పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సదస్సులో వివిధ కేటగిరీలలీ పలువురు పార్లమెంటేరియన్స్ కు పురస్కారాలు ప్రదానం చేసి, జ్ఞాపికలు అందించి, శాలువాతో సత్కరించారు. ప్రముఖ రాజకీయ నాయకులు మల్లికార్జున ఖర్గే,మురళీ మనోహర్ జోషి,శరధ పవార్ ఈ కార్యక్రమానికి అతిధులుగా హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్