Tuesday, March 17, 2026
Homeసినిమా'లూజర్ 2' ట్రైలర్ విడుదల

‘లూజర్ 2’ ట్రైలర్ విడుదల

Looser 2: ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’లో విడుదలైన ఒరిజినల్ సిరీస్ ‘లూజర్‘ చూశారా? ఆ సిరీస్‌ను అంత త్వ‌ర‌గా వీక్షకులు మర్చిపోలేరు. టైటిల్ ‘లూజర్’ కావచ్చు. కానీ, రిజల్ట్ విషయంలో విన్నరే. వీక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేసిన సిరీస్ అది. ఇప్పుడు ఆ సిరీస్‌కు సీక్వెల్ వస్తోంది. అదీ ‘జీ 5’లోనే!

స్పోర్ట్స్ డ్రామా జాన‌ర్‌లో రూపొందిన ఒరిజినల్ సిరీస్ ‘లూజర్’తో వీక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రజల కోరిక మేరకు ఇప్పుడు ‘లూజర్ 2’ తీసుకువస్తోంది. ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 2’. హిట్ సిరీస్ ‘లూజర్’కు సీక్వెల్ ఇది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తొలి సీజన్ తెరకెక్కింది.

‘లూజర్ 2’కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. దీనికి అభిలాష్ రెడ్డి క్రియేటర్. జీ5, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌ నిర్మించిన ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను స్టార్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ కిదాంబి శ్రీ‌కాంత్ విడుద‌ల చేశారు. ‘లూజర్ 2’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి కలిగించేలా ఉంది. విల్సన్ కుమారుడు క్రికెటర్ కావాలని అనుకోవడం… సూరి యాదవ్ ఫేమ్ వచ్చిన తర్వాత ఎలా మారాడు? రూబీ కథేంటి? అనేది ఆసక్తికరంగా ఉంది. డైలాగులు బావున్నాయి. ఈ నెల 21న ‘జీ 5’లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular