Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్బాక్సింగ్ లో సెమీస్ కు లవ్లీనా

బాక్సింగ్ లో సెమీస్ కు లవ్లీనా

టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ సెమీస్ లోకి దూసుకెళ్లింది. నేడు జరిగిన 69 కిలోల మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో చైనా థైపీకు చెందిన నీన్ చిన్ చెన్ పై 4-1 తేడాతో విజయం సాధించి సెమీస్ లో ప్రవేశించింది. అంతకుముందు ఫ్రీ క్వార్టర్స్ రెండో రౌండ్ లో జర్మన్‌కి చెందిన నదైన్ అపెజ్‌ను 3-2 తేడాతో ఓడించిన లవ్‌లీనా క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లింది.

ఇండియా కు చెందిన స్టార్ బాక్సర్ మేరీ కోమ్ 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం గెల్చుకున్న తరువాత  మళ్ళీ ఇప్పుడు లవ్లీనా సెమీస్ కు చేరి పతకం ఖాయం చేసింది.

మరోవైపు, పురుషుల బాక్సింగ్ లో ఇండియాకు చెందిన సిమ్రాన్ జీత్ సింగ్  60 కిలోల విభాగంలో ఓటమి పాలయ్యారు. థాయ్ లాండ్ బాక్సర్ చేతిలో 5-0 తేడాతో ఓడిపోయారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్