Saturday, November 23, 2024
HomeTrending News800 లుఫ్తాన్సా విమానాలు రద్దు

800 లుఫ్తాన్సా విమానాలు రద్దు

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. లుఫ్తాన్సాకు చెందిన పైలట్లు సమ్మేకు దిగారు. దీంతో సంస్థ 800 విమానాలను రద్దు చేసింది. జీతాల పెంపును డిమాండ్‌ చేస్తూ పైలెట్ల యూనియన్‌ శుక్రవారం విధులు బహిష్కరించాలని నిర్ణయించింది. విమానాల రద్దుతో జర్మనీలోని ఫ్రాంక్‌ఫోర్ట్‌, మ్యూనిచ్‌ ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలు నిలిచిపోవడంతో లక్షా 30 వేల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది.

లుఫ్తాన్సా పైలెట్లు ఈ ఏడాది 5.5 శాతం మేర జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు యాజమాన్యం ఒప్పుకోలేదు. సీనియర్‌ పైలెట్లకు 900 యూరోలు అంటే 5 శాతం, కొత్త ఉద్యోగులకు 18 శాతం మేర జీతాలు పెంచుతామని తెలిపింది. ఈ ఆఫర్‌ను పైలెట్ల యూనియన్‌ నిరాకరించడంతో సమ్మె అనివార్యమైంది. దీంతో ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రయాణీకులు, వారి బంధువులు  ఆందోళనకు దిగారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్