Tuesday, June 16, 2026
HomeTrending NewsHMDA: సచివాలయం సమీపంలో 22న పార్కులకు సెలవు

HMDA: సచివాలయం సమీపంలో 22న పార్కులకు సెలవు

హైదరాబాద్ డాక్టర్ బి.అర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా ఈనెల 22వ తేదీన (గురువారం) పరిసరాల పార్కులకు సెలవు ప్రకటిస్తున్నట్లు హెచ్ఎండిఏ తెలిపింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరుల స్మారకాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 22న ప్రారంభించనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకానికి, పార్కులకి వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ముందు జాగ్రత చర్యల్లో భాగంగా బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు (బిపిపి) పరిధిలో ఉన్న లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్ లను గురువారం(22వ తేదీన) మూసివేస్తారని హెచ్ఎండిఏ వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular