Sunday, January 19, 2025
HomeTrending Newsఅందుబాటులో అంతర్జాతీయ కంటివైద్యం

అందుబాటులో అంతర్జాతీయ కంటివైద్యం

LV Prasad Eye Institute Management Team Met Ap Cm Jagan :

అంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరూ కంటి సంబంధమైన వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళకుండా, అంతర్జాతీయ స్ధాయి అత్యాధునిక కంటి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్‌వి ప్రసాద్‌ కంటి ఆసుపత్రి ప్రతినిధి బృందానికి విజ్ఞప్తి చేశారు. దీనికి వారు అంగీకారం తెలియజేశారు. ఎల్‌ వి ప్రసాద్‌ ఐ ఇన్ట్సిట్యూట్‌ ఫౌండర్‌ చైర్మన్‌ డాక్టర్‌ గుళ్ళపల్లి ఎన్‌. రావు, ఫౌండర్‌ మెంబర్‌ జి. ప్రతిభారావులు క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కడపలో టెరిషియరీ కేర్‌ ఐ ఇన్ట్సిట్యూట్‌ ఏర్పాటుకు అవసరమైన స్ధలాన్ని కేటాయిస్తూ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంపై కృతజ్ఞతలు తెలియజేశారు.  రాష్ట్రంలో కాంప్రహెన్సివ్‌ ఐ కేర్‌కు సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఎల్‌ వి ప్రసాద్‌ సంస్థ ముందుకొచ్చింది.

కంటికి సంబంధించి, అంధత్వ నివారణకు స్క్రీనింగ్‌ నుంచి సర్జరీ వరకూ అన్ని స్ధాయిలలోనూ అత్యాధునిక వైద్యం అందించేందుకు తగిన ప్రణాళికలు సిద్దం చేయాలని ఆసుపత్రి యాజమాన్యానికి సిఎం సూచించారు. ష్ట్రంలో ఉన్న అన్ని అనాధ శరణాలయాల్లోని చిన్నారులకు నేత్ర వైద్య పరీక్షలు, చికిత్సలు ఉచితంగా చేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎల్‌ వి ప్రసాద్‌ ఐ ఇన్ట్సిట్యూట్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రశాంత్‌ గార్గ్, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ రెడ్డి పప్పూరు, సీఎంవో అధికారులు కూడా పాల్గొన్నారు.

Must Read : ఏది స్వదేశి? ఏది విదేశి?

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్