Saturday, January 18, 2025
Homeసినిమాగీత రచయిత కందికొండ ఆరోగ్యం ఆందోళనకరం

గీత రచయిత కందికొండ ఆరోగ్యం ఆందోళనకరం

ప్రముఖ సినీ గేయ రచయిత, శాలివాహన ముద్దు బిడ్డ కందికొండ గిరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి…. కష్టపడి చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీలో పీ.హచ్. డి పూర్తి చేసుకొన్న కందికొండ సరస్వతీ పుత్రుడుగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలను, పండుగల విశష్టతలను, విశేషాలను తెలియజేసే ఎన్నో పాటలు రాసిన గిరి ప్రస్తుతం గొంతు క్యాన్సర్ వ్యాధితో భాధపడుతూ గత కొన్ని రోజులుగా హస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

జి.హెచ్.ఎం.సి., తెలంగాణ బోనాల పాట, సమ్మక్క సారక్కల పాట, కాళేశ్వరం పాట, దీపావళి పాట, సంక్రాంతి పాటలతో పాటు దేశముదురు, పోకిరి, మున్నా, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి మరెన్నో హిట్ చిత్రాలకు కలిపి దాదాపు 1200 పాటలు రాశారు.

గత 15 రోజుల నుండి అపోలో హస్పిటల్ లో చికిత్స తీసుకున్న గిరి ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. కందికొండ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి వన్నె తెచ్చిన పాటలు రాసిన కందికొండ గిరికి మనకు తోచిన ఆర్థిక సహయం చేద్దాం. సరస్వతి పుత్రుడిని కాపాడుకుందాం. కందికొండకు దాతలు ఎవరైనా సహాయం చేయాలనుకొంటే.. అతడి భార్య గూగుల్ పే & ఫోన్ పే నెంబర్ 8179310687 తమకు తోచిన విధంగా సాయం చేయవచ్చు.

కందికొండకు మంత్రి కేటీఆర్ చేయూత
కందికొండ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన మంత్రి కేటియార్, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల 50 వేల రూపాయల సహాయం అందేలా చూశారు. ఈ మేరకు హాస్పిటల్ యాజమాన్యం తో మాట్లాడారు. కందికొండ పాటలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చరిత్రకు అద్దం పట్టేలా ఉంటాయని, ఆయన సాహిత్య సేవ మరింత కాలం కొనసాగేలా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్