Saturday, June 27, 2026
Homeసినిమా‘అద్భుతం’ నుంచి ‘పేరేంటి ఊరేంటి’ లిరికల్ సాంగ్

‘అద్భుతం’ నుంచి ‘పేరేంటి ఊరేంటి’ లిరికల్ సాంగ్

తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంటగా మహా తేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై చంద్రశేఖర్ మోగుళ్ళ నిర్మిస్తున్న సినిమా ‘అద్భుతం’. మల్లిక్ రామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఊరేంటి పేరేంటి’ లిరికల్ సాంగ్ విడుదలైంది. తేజ, శివాని రాజశేఖర్ ఇద్దరూ ఈ పాటలో చాలా అందంగా ఉన్నారు. రధన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. విద్యాసాగర్ చింత సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గ్యారీ బీహెచ్ ఎడిటర్. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించారు. లక్ష్మీ భూపాల స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

తేజ సజ్జ, శివాని రాజశేఖర్.. తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్: సృజన్ ఎర్లబోలు, కథ: ప్రశాంత్ వర్మ, స్క్రీన్ ప్లే, మాటలు: లక్ష్మీ భూపాల, సంగీతం: రధన్, ఎడిటర్: గ్యారీ BH, సినిమాటోగ్రాఫర్: విద్యాసాగర్ చింత, PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్, నిర్మాణ సంస్థలు: ఎస్ ఒరిజినల్స్, మహా తేజ క్రియేషన్స్, నిర్మాత: చంద్రశేఖర్ మోగుళ్ళ, దర్శకుడు: మల్లిక్ రామ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular