తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి వినున్త్నమైన నిర్ణయాలతో ప్రజల మనసు చూరగొన్నారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్న స్టాలిన్ ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టినా విపక్షాల సలహాలు కుడా తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. పదేళ్ళపాటు అధికారానికి దూరంగా ఉన్న డి.ఎం.కే ను మళ్ళీ గెలిపించి తమిళనాడులో సూర్యోదయం(పార్టీ గుర్తు) వచ్చేలా చేశాడని పార్టీ శ్రేణులు, అభిమానులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర శాసనసభలో ఐదు కీలక ప్రకటనలు చేశారు.
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని ప్రకటించారు. దీని కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉదయం టిఫిన్ కూడా పెడుతుంది. అలాగే, స్కూల్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్, పాఠశాల విద్యార్థులకు మెడికల్ చెకప్, పట్టణాల్లో మాదిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి, ‘మీ నియోజకవర్గంలో సీఎం’ అనే పథకాలను ప్రారంభిస్తున్నట్టు స్టాలిన్ తెలిపారు.
ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఎంకే స్టాలిన్ (69) శనివారం ఉదయం చెన్నై నగరంలో బస్ లో అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడారు. తన ప్రభుత్వం ఏడాది పాలన గురించి ఏమనుకుంటున్నారు? అంటూ బస్సు కండక్టర్, ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఇదేల్లలోపు చిన్నారులకు బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మెరీనాబీచ్ సమీపంలోని తన తండ్రి డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి సమాధి వద్ద నివాళులు అర్పించారు.
Also Read : చెన్నై మేయర్ గా తొలిసారి దళిత మహిళ