Friday, April 26, 2024
HomeTrending Newsమాచర్లలో పరిస్థితి అదుపులో ఉంది : జిలా ఎస్పీ

మాచర్లలో పరిస్థితి అదుపులో ఉంది : జిలా ఎస్పీ

మాచర్లలో జరిగిన సంఘటన  ఫ్యాక్షన్ గొడవల్లో భాగంగా జరిగిందని, దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదని పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.  మాచర్లలో సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా అయన ఆయన మీడియాతో మాట్లాడుతూ… వెల్దుర్తికి సంబంధించిన ఫ్యాక్షన్ నేరచరిత్ర కలిగిన వ్యక్తులు  మాచర్ల పట్టణంలో నివసిస్తున్నారన్న సమాచారంతో ముందస్తు చర్యలల్లో  భాగంగా ఈరోజు ఉదయం నుండే అక్కడ కార్డెన్ & సర్చ్ నిర్వహించామని తెలిపారు.  సాయంత్రం జరిగిన ‘ఇదేమి కర్మ మనరాష్ట్రానికి’  ఈ ఫ్యాక్షన్ నేరచరిత్ర కలిగిన వ్యక్తులు పాల్గొని ఉద్దేశపూర్వకంగా సమీప ప్రత్యర్థులపై రాళ్లతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారని ఎస్పీ వివరించారు. ఈ ప్రాంతంలో గత 20 నుండి 30 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్షన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు.  పూర్తిగా ఫ్యాక్షన్ కు  సంబంధించిన గొడవకు రాజకీయరంగు పులిమే ప్రయత్నం చేస్తూ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడ్డారన్ని వెల్లడించాడు.

దాడుల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరినీ అదుపులోకి తీసుకుంటున్నామని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్