Saturday, July 27, 2024
Homeసినిమాటాలీవుడ్ లో బిజీ అయిన మధు నంబియార్

టాలీవుడ్ లో బిజీ అయిన మధు నంబియార్

తెలుగు సినిమాల్లో  ఏ పాత్ర ఇచ్చినా అందులో పూర్తిగా ఒదిగిపోతూ టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్న నటుడు మధు నంబియార్. తాజాగా తను సైంటిస్ట్ పాత్రలో నటించిన చిత్రం “గంధర్వ”. యఎస్‌.కె. ఫిలిమ్స్, ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌ టైన్‌మెంట్ పతాకం పై సందీప్ మాధ‌వ్‌, గాయ్ర‌తి ఆర్‌. సురేష్ జంట‌గా అప్స‌ర్ దర్శకత్వం లో సుభాని ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్బంగా ఈ చిత్రంలో సైంటిస్ట్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటుడు మధు నంబియార్ పాత్రికేయ మిత్రులకు తన కెరీర్ గురించి.. ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి తెలియచేశారు.

ఈ సందర్భంగా మధు నంబియార్ మాట్లాడుతూ..  నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా ఇష్టం. నా మాతృభాష మలయాళం అయినప్పటికీ.. నేను పుట్టింది మాత్రం హైదరాబాద్లోనే. నేను లా చదువుతున్న టైంలోనే నాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ రావడంతో ఇండియా మొత్తం జర్నీ చేయడం జరిగింది. 2005 లో వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకొని  లాయర్ గా బార్ కౌన్సిల్ లో నా పేరు నమోదు చేసుకొని లాయర్ గా వర్క్ చేయడం జరిగింది. ఆ తరువాత సినిమాలలో నటించాలనే కోరిక నాలో బలంగా ఉండడంతో నా ఫ్రెండ్స్ కూడా సినిమాలలో నటించమని ఎంకరేజ్ చేయడంతో నేను గ్లిట్టర్స్ ఫిలిం అకాడమీ లో ట్రైనింగ్ తీసుకున్నాను.

అయితే.. అనూహ్యంగా దీపక్ బల్ దేవ్ దర్శకత్వంలో గ్లిట్టర్స్ వారు తీసిన “క్వాబ్ సారె ఝాటే” అను హిందీ మూవీ లో బిజినెస్ మెన్ గా నెగిటివ్ రోల్ లో నటించడం జరిగింది. మొదటిసారి బాలీవుడ్ లో నేను నటించిన ఈ పాత్రకు “IIFA” లో బెస్ట్ సపోర్ట్ యాక్టర్ గా నామినేట్ అవ్వడం విశేషం. ఆ తరువాత నేను వివిధ భాషల్లో నటించడం జరిగింది. తెలుగులో నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చిన చిత్రం చంద్ర శేఖర్ ఏలేటి గారి “చెక్”. దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన షాదీ ముబారక్ లో డాక్టర్ గా ,ఆ తరువాత “ఈ కథలో పాత్రలు కల్పితం” లో డి. జి. పి గా, నవీన్ చంద్ర హీరోగా నటించిన మిషన్ 2020 లో పోలీస్ ఆఫిసర్ గా నటించాను. ఈ సినిమాలు నాకు మంచి పేరును తీసుకువచ్చాయి.

అలాగే కన్నడలో పునీత్ రాజ్ కుమార్ నటించిన యువరత్న, తరువాత మలయాళంలో కూడా నటించాను. ఇలా అన్ని భాషల చిత్రాల్లో నటించడం జరిగింది. ఇపుడు తాజాగా నేను నటించిన చిత్రం “గంధర్వ”. ఇందులో సైంటిస్ట్ గా నటించిన పాత్రకు చాలా మంది నుండి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ నన్ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ 2022 లో నేను నటించిన  “దర్జా”, దుల్కర్ సల్మన్ సినిమా “సీతా రామం”లో ఆర్మీ ఆఫీసర్ గా చేస్తున్న సినిమా నాకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. ఇంత వరకు నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ఇక ముందుకూడా ఇలాగే నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్