Friday, September 20, 2024
HomeTrending NewsMadhyapradesh: స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశ్రుతి

Madhyapradesh: స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశ్రుతి

మధ్యప్రదేశ్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రభురామ్ చౌదరి మంగళవారం రైసేన్ లో జెండా ఎగురవేసిన కొన్ని క్షణాల్లోనే వేదికపై కుప్పకూలిపోయారు. ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో అక్కడున్న పోలీసులు, ఇతర సిబ్బంది, నాయకులు అలెర్ట్ అయ్యారు. వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించారు.
ఇండియా టీవీ’ కథనం ప్రకారం.. రైసేన్ జిల్లాలోని హోంగార్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి ప్రభురామ్ చౌదరి హాజరయ్యారు. అక్కడి పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. అది ముగిసిన కొంత సమయం తరువాత కొన్ని సెకన్లకే మంత్రి హఠాత్తుగా కిందపడిపోయారు.
దీంతో పక్కనే ఉన్న పోలీసు ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయనను ఎత్తుకొని అక్కడే ఉన్న అంబులెన్స్ లో ఎక్కించారు. భోపాల్ లోని ఓ హాస్పిటల్ కు తరలించారు. మంత్రికి రక్తపోటు ఎక్కువగా ఉండి షుగర్ లెవల్స్ తగ్గి ఉండొచ్చని ఈ కార్యక్రమానికి హాజరైన వైద్యులు తెలిపారు. కాగా.. హాస్పిటల్ లో ఆయనకు ఎలక్ట్రో కార్డియోగ్రఫీ (ఈసీజీ) తీశారు. అందులో కొన్ని మార్పులు కనిపించాయి. దీంతో గుండెపోటు వచ్చి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్