Tuesday, June 9, 2026
Homeసినిమానితిన్ ‘మ్యాస్ట్రో’ ఫైనల్‌ షెడ్యూల్‌ ప్రారంభం

నితిన్ ‘మ్యాస్ట్రో’ ఫైనల్‌ షెడ్యూల్‌ ప్రారంభం

హీరో నితిన్‌ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘మ్యాస్ట్రో’. నితిన్‌ 30వ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్‌ కామెడీ చిత్రంలో నితిన్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ‘మ్యాస్ట్రో’ చివరి షెడ్యూల్‌ ఈ రోజు హైదరాబాద్‌లో మొదలైంది. నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ తో ‘మ్యాస్ట్రో’ సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత షూటింగ్ మొదలుపెట్టిన తొలి సినిమా ‘మ్యాస్ట్రో’ కావడం విశేషం.

నితిన్‌ బర్త్‌ డే సందర్భంగా విడుదల చేసిన ‘మ్యాస్ట్రో’ ఫస్ట్‌లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు నితిన్‌ హిట్‌ మూవీ ‘భీష్మ’కు కూడా ఆయనే స్వరాలు సమకూర్చారు.

శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ‘మ్యాస్ట్రో’ సినిమాకు జె యువరాజ్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్, జిస్సూ సేన్‌ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్దన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్షన్, డైలాగ్స్‌: మేర్లపాక గాంధీ నిర్మాతలు: ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular