మహేష్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో భారీ, క్రేజీ మూవీ చేస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్ డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముందుగా యాక్షన్ మూవీ చేయాలి అనుకున్నారు.. అయితే.. మహేష్ ఫ్యామిలీ స్టోరీ చేద్దామనడంతో త్రివిక్రమ్ పూర్తిగా కథ మార్చారు. ప్రస్తుతం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తున్నారు.
అయితే.. ఈ మూవీకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేశారు. అందులో మహేష్, త్రివిక్రమ్‌లతో పాటు మలయాళ నటుడు జయరాం కూడా కనిపించారు. ఈ స్టిల్స్ లో అందరి దృష్టినీ ఆకర్షించింది మహేష్ బాబు లుక్. ఈ లుక్ మహేష్ మూడు సినిమాలను గుర్తు చేస్తుంది. ఇంతకీ ఆ మూడు సినిమాలు ఏంటంటే… మహేష్ పొడవాటి జుట్టును చక్కగా స్టైలింగ్ చేయించుకుని కనిపించింది మొదటగా అతిథి సినిమాలో. ఆ తర్వాత సర్కారు వారి పాటలోనూ అదే జులపాల జుట్టుతో కనిపించాడు కానీ.. అతిథి చిత్రంలో ఉన్న రఫ్ లుక్ ఇక్కడ లేదు.
అయితే.. మధ్యలో మహేష్ చేసిన మహర్షి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ వరకు కొంచెం గడ్డం, మీసంతో కనిపించాడు. మొత్తానికి త్రివిక్రమ్ మహేష్ లుక్ కోసం.. అతిథి, మహర్షి, సర్కారు వారి పాట సినిమాల రిఫరెన్స్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎన్ని రిఫరెన్స్ లు తీసుకున్నప్పటికీ.. ఈ లుక్ లో మహేష్ కొత్తగా కనిపిస్తున్నారు. ఈ స్టిల్స్ చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఉగాదికి ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేయనున్నారు. ఆగష్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరి.. అతడు, ఖలేజా చిత్రాలను మించిన సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.