Sunday, June 14, 2026
Homeసినిమాచిరంజీవితో గొడవలు ఉన్నాయి అయినా.. - మోహన్ బాబు

చిరంజీవితో గొడవలు ఉన్నాయి అయినా.. – మోహన్ బాబు

మోహన్ బాబు 500 వందలకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు తెర పై చెరగని ముద్ర వేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. ఈమధ్య సన్నాఫ్ ఇండియా అనే సినిమా చేశారు. ఇప్పుడు అగ్ని నక్షత్రం అనే సినిమా చేస్తున్నారు. అయితే.. మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్ వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చిరంజీవి, మోహన్ బాబు.. ఈ సీనియర్ హీరోలిద్దరూ మంచి మిత్రులు. అయితే.. వీరిద్దరి మధ్య విభేదాలు రావడం కూడా తెలిసిందే.

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్ వ్యూలో మోహన్ బాబు.. చిరంజీవితో విభేదాలు గురించి స్పందించారు. ఇంతకీ.. మోహన్ బాబు ఏం చెప్పారంటే… ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాను. ఒక టీచర్ అయిన నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా, విలన్ గా, నటుడిగా, హీరోగా, ఒక యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గా ఎదిగాను దానికి కారణం  తల్లిదండ్రుల ఆశీస్సులు.. ప్రేక్షకుల ఆశీర్వాదాలు అని చెప్పారు. అలాగే తను పడిన కష్టాలు పగవాడు కూడా పడకూడదని కోరుకుంటున్నాను. సంపాదించివన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇల్లు, స్థలాలు అన్ని అమ్మేశాను. తిరిగి సాధించాను. ఇల్లే కాదు ఒక యూనివర్సిటీనే స్థాపించాను అంటూ గతాన్ని తలుచుకుని మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు.

ఇక చిరంజీవితో గొడవలు గురించి స్పందిస్తూ.. చిరంజీవితో గొడవలు ఉన్నాయి. అయినా.. మేం ఇద్దరం మాట్లాడుకుంటాం. పలకరించుకుంటాం.. మా గొడవలు భార్యాభర్తల లాంటివి. ఎంత పొట్లాడుకున్నా.. మళ్లీ కలిసిపోతూ ఉంటాం అని చెప్పారు. ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేను. ఎన్టీఆర్, కృష్ణ మరణించినప్పుడు.. ఈ మధ్య జరిగిన మనోజ్ పెళ్లిలో కూడా ఏడ్చేశాను అన్నారు మోహన్ బాబు. అలాగే సోషల్ మీడియాలో తన పైన, తన ఫ్యామిలీ మెంబర్స్ పైన ట్రోల్స్ వస్తున్నాయి. వాటిని పట్టించుకోను అని చెప్పారు. మంచు మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular