Friday, April 19, 2024
HomeTrending Newsబాబువి పగటి కలలే: సజ్జల

బాబువి పగటి కలలే: సజ్జల

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికారులపై తాము ఒత్తిడి తెచ్చామంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఖండించారు. వ్యవస్థల్లోకి వైరస్‌లా దూరడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని…. నిజంగా సీఎంఓ నుంచి ఒత్తిడి చేసి ఉంటే.. ఫలితం అలా ఎందుకు ఉంటుందాని ప్రశ్నించారు. అధికారులు మా అడుగులకు మడుగులు ఒత్తితే బాబు హయాంలో మాదిరిగా ‘స్కిల్‌ స్కామ్‌’లు జరిగేవని, ఏబీ వెంకటేశ్వరరావులాంటి వారు మొత్తం రాజ్యం నడిపే వారని ఎదురుదాడి చేశారు.

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలో అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా మేం నిరూపించామని, ఆధారం ఉంది కాబట్టే రీకౌంటింగ్‌ అడిగామని, నిబంధనల మేరకు అడగటం మా హక్కు అని సజ్జల స్పష్టం చేశారు. సరైన ఆధారాలు చూపించినా అక్కడ చర్యలు తీసుకోలేదని, టీడీపీలోని పెద్ద నాయకులు ఏజెంట్లగా కూర్చుని అధికారులను దబాయించారని ఆరోపించారు. అసెంబ్లీ–మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన సజ్జల… నేడు ప్రెస్ మీట్ లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

సజ్జల మాట్లాడిన ముఖ్యాంశాలు”

  •  ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా దబాయించడం చంద్రబాబు లక్షణం
  • మేం ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా హక్కుల కోసం పోరాడాల్సి వస్తోంది
  • ప్రజాస్వామ్యయుతంగా ధర్మయుద్ధం చేయడమే వైఎస్సార్సీపీకి తెలుసు
  • పశ్చిమ రాయలసీమ కౌంటింగ్‌పై లీగల్‌గా వెళ్లేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు
  • వచ్చిన తీర్పును గౌరవిస్తాం… కానీ చంద్రబాబుతో చెప్పించుకునే పరిస్థితి మాకు లేదు
  • చంద్రబాబు అంబేద్కర్‌ సూక్తి చెప్పడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే
  • ఏరోజైతే ఆయన అసెంబ్లీకి రానన్నాడో.. ఇక ఎన్నటికీ రాడనేది ఫిక్సయ్యింది
  • కుప్పంలో మేం కొట్టిన దెబ్బకి.. పులివెందుల పోయిందంటూ శునకానందం
  • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ప్రలోభపెట్టాలని బాబు ప్రయత్నాలు చేస్తున్నారు
  •  ఈ ఫలితాలు చూసి ధైర్యం వచ్చిందనుకుంటే 175 స్థానాలకూ పోటీ చేస్తామని చెప్పండి
  • పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల కౌంటింగ్‌ విషయంలో వాళ్ళ వాళ్లు పట్టుబడ్డారని రిటర్నింగ్‌ అధికారి కూడా చెప్తున్నాడు
  • అక్కడి అధికారులు వ్యవహరించిన తీరు అభ్యంతర కరంగా ఉందని మేం భావిస్తున్నాం
  • సరైన ఆధారాలు చూపించినా అక్కడ చర్యలు తీసుకోలేదు
  • కౌంటింగుకు మా అభ్యర్థి, ఏజెంట్లుగా ఉన్న కార్యకర్తలు మాత్రమే వెళ్లారు.
  •  టీడీపీ వాళ్లు మాత్రం కడప, అనంతపురం జిల్లాల్లోని పెద్ద నాయకులు అందరూ ఏజెంట్లుగా కూర్చున్నారు
  • ఈ రోజు మాట్లాడిన ప్రతి మాటలో… అధికార కాంక్ష, ప్రజలు ఆయన్ను గద్దెనెక్కించినట్లు పగటి కలలు కంటున్నాడు బాబు
  • అంత  బలమే ఉంటే.. 175 స్థానాల్లో పోటీ చేస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నావ్ బాబూ?
  • మళ్లీ చెప్తున్నాం….ఆ కలలే ఆయనకు మిగులుతాయి…
  • అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం దీనిలో ప్రతిబింబించలేదనేది వాస్తవం
  • అలా అని వచ్చిన ఫలితాలను మేం కొట్టేసినట్లు కాదు..వచ్చిన తీర్పును గౌరవిస్తాం
  • కానీ దీన్ని చంద్రబాబుతో చెప్పించుకునే  పరిస్థితి మాకు  లేదు
  • చూద్దాం రేపు వచ్చే ఫలితాలే దీనికి సమాధానం చెప్తాయి
  • వాళ్లకి బలం ఉన్నప్పుడు..  మేమే గెలుస్తాం అంటూ ఈ డాంభికాలు ఎందుకు..?
RELATED ARTICLES

Most Popular

న్యూస్