Saturday, March 14, 2026
Homeసినిమా‘సర్కారు వారి పాట’ డైలాగ్ లీక్ - సోషల్ మీడియాలో వైరల్.

‘సర్కారు వారి పాట’ డైలాగ్ లీక్ – సోషల్ మీడియాలో వైరల్.

పరశురామ్ దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు, మరి కొంత మంది నటీనటుల పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే.. షూటింగ్‌ లొకేషన్‌లో మహేష్‌ బాబు చెబుతున్న భారీ డైలాగ్‌ లీకైంది. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే…

‘పొద్దున్నే లేచి వాకింగ్ చేశామా.. మంచి డైట్ ఫుడ్ దొబ్బి తిన్నామా.. మళ్లీ సాయంత్రం అయ్యాక మొబైల్ చూశామా? కొడుకు, మనవడు, మనవరాలుతో ఆడుకుని.. మళ్లీ దొబ్బి తిని పడుకున్నామా? లేదా..? ఇదే కదా మనము చేసేది రోజూ..” అంటూ పబ్లిక్‌కు మహేష్‌ క్లాస్‌ ఇస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ ప్రెస్టీజియస్ మూవీకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్.ఎస్. థమన్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఈ మూవీ టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular