మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు సంబంధించిన యాక్షన్ పార్ట్ చిత్రీకరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ సినిమా తర్వాత మహేష్.. రాజమౌళితో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో సెట్స్ పైకి వస్తుందని టాక్. అయితే.. రాజమౌళితో సినిమా కంటే ముందు మరో సినిమా చేయడానికి మహేష్ ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతుంది. ఏజెంట్, భోళా శంకర్ చిత్రాలతో భారీ నష్టాలు చూసిన అనిల్ సుంకరకు మహేష్ బాబు ఫోన్ చేసి మంచి కథ ఉంటే చూడండి సినిమా చేద్దామని చెప్పారట. దీంతో మహేష్, అనిల్ సుంకర బ్యానర్ లో సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా కథ సెట్ అయ్యిందని.. అనిల్ రావిపూడి స్టోరీ ఎప్పుడో రెడీ చేసి పెట్టాడని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.
మహేష్ బాబుతో అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేయడం.. అది బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించిన అనిల్ రావిపూడితో మహేష్ మరో సినిమా చేయాలి అనుకున్నారు. అందుచేత ఈ క్రేజీ కాంబో మరోసారి ఫిక్స్ అయ్యింది అంటూ టాక్ వినిపిస్తుంది. మరో వైపు రాజమౌళి సినిమా కంటే ముందు మరో సినిమా చేసే ఛాన్స్ లేదని.. ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదని కూడా సినీ జనాలు అంటున్నారు. అయితే.. క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.