-1.4 C
New York
Wednesday, November 29, 2023

Buy now

HomeTrending NewsPFI: కేరళలో దారుణం...మీడియాకు పట్టని వైనం

PFI: కేరళలో దారుణం…మీడియాకు పట్టని వైనం

దేశమంతా ఖలిస్తాని వేర్పాటువాదుల అంశంపై దృష్టి సారించగా కేరళలో ఇస్లామిక్ అతివాదులు దారుణ చర్యకు పాల్పడ్డారు.  కేరళలోని కొల్లాం ప్రాంతంలో ఆదివారం రాత్రి ఓ ఆర్మీ జవానుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు చెందిన దుండగులు ఆర్మీ జవాను చేతులను టేపుతో కట్టేసి అతడిపై తీవ్రంగా దాడి చేశారు. జవాను షర్ట్ చించేసి వీపు మీద PFI అని ఆకుపచ్చ పెయింట్ తో రాసి పారిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆదివారం రాత్రి కడక్కల్‌లో తన ఇంటి పక్కనే రబ్బరు అడవిలో ఆరుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఆర్మీ జవాన్‌ షైన్ కుమార్ తెలిపాడు. బాధిత జవాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు ఇస్లామిక్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఈ పార్టీపై దేశంలో నిషేధం విధించారు. పీఎఫ్‌ఐ కార్యకలాపాలు, ఆర్థిక వనరులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్నాయి.

దేశంలోని ప్రధాన మీడియా, వార్త పత్రికలూ ఈ దారుణానికి ఇవ్వాల్సిన రీతిలో ప్రాధాన్యం ఇవ్వలేదు. మొక్కుబడిగా ఇచ్చి వదిలేశారు. గొర్రె దాటు మాదిరిగా కెనడా భారత్ సంబంధాలు, ఖలిస్తానీ వేర్పాటువాదుల వార్తలకే ప్రాముఖ్యత ఇచ్చారు.

ఇక తెలుగు మీడియా సంగతి సరేసరి… ఒక ప్రధాన పత్రిక అయితే ఆ వార్తనే ప్రచురించలేదు. చంద్రబాబు అరెస్టుతో తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలం అవుతున్నట్టుగా వార్తలు అల్లటం, ఎమ్మెల్సీ కవితను ఎప్పుడు అరెస్టు చేస్తారు? సిఎం జగన్ ను నిందించటం, కాంగ్రెస్ లో వర్గపోరు ఇవే ప్రధాన శీర్షికలు. అప్పుడప్పుడు కెనడా- భారత్, ఖలిస్తానీ అంశాలు కనిపిస్తున్నాయి.

జవానుపై దాడి చేసిన ఇస్లామిక్ ఉగ్రవాదులపై కేరళ ప్రభుత్వం ఎలాగు చర్యలు తీసుకోలేదు. ఎన్నికల ఏడాది, ఓట్ల రాజకీయాలు అక్కడి ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ కేసులో నిజా నిజాలు తేల్చాల్సింది కేంద్ర దర్యాప్తు సంస్థలే.

ఖలిస్తానీ వేర్పాటువాదులకు, ఇస్లామిక్ ఉగ్రవాదులకు సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పాకిస్థాన్, కెనడా కేంద్రాలుగా రెండు వర్గాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. రెండు రోజులుగా పంజాబ్ లో దర్యాప్తు సంస్థల విచారణలో విస్తుగోలిపే అంశాలు బయట పడుతున్నాయి.

30 మందిని అదుపులోకి తీసుకొని.. యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ (ఏజీటీఎఫ్) విచారిస్తోంది. విదేశాల్లో ఉగ్రవాదులకు, గ్యాంగ్‌స్టర్లు సహాయం అందిస్తున్నారు. కరోనా సమయంలో ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లకు సోషల్‌ మీడియా ద్వారా పంజాబ్‌ యువతను మచ్చిక చేసుకొని వారిని తన నెట్‌వర్క్‌తో కనెక్ట్‌ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

దక్షిణ భారతంలో చెన్నై, కేరళ, కర్నాటకలోని మంగళూరు, బీదర్, కాలాబురిగి (గుల్బర్గ) ప్రాంతాల్లో.. హైదరాబాద్ లో పాపులర్ ఫ్రంట్ సానుభూతిపరులు అధికంగా ఉన్నారు. ఈ నిషేధిత సంస్థ కార్యకలాపాలను నిలువరించేందుకు దర్యాప్తు సంస్థలకు అన్ని వర్గాలు సహకరించాలి. అందుకు మీడియానే ప్రధాన పాత్ర పోషించాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్