Sunday, January 19, 2025
Homeసినిమా'శ్రీదేవి సోడా సెంటర్' కు మహేష్ ప్రశంసలు

‘శ్రీదేవి సోడా సెంటర్’ కు మహేష్ ప్రశంసలు

సుధీర్ బాబు, ఆనంది జంటగా 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కరుణ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఆగస్ట్ 27న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. విడుదలైన రోజే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా షో వేసుకొని చూశారు. సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు మహేష్ బాబు. సుధీర్ బాబు అద్భుతంగా నటించారని.. ఆయన కెరీర్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అంటూ అభినందించారు. ప్రత్యేకంగా ఆడవాళ్ళంతా తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అని మహేష్ అన్నారు.

హీరోయిన్ ఆనంది పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు మహేష్ బాబు. బోట్ సన్నివేశాల గురించి ప్రస్తావిస్తూ ఈ సీన్స్ అన్నీచాలా బాగున్నాయని కితాబిచ్చారు. శ్యామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం నెక్ట్స్ లెవల్లో ఉన్నాయని, ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాణం అని తెలిపారు మహేష్ బాబు.

హీరో సుధీర్ బాబు, నిర్మాతలు, దర్శకుడు స్వయంగా వెళ్లి మహేష్ బాబును కలిశారు. ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా.. శ్రీదేవి సోడా సెంటర్ సినిమా యూనిట్ ను కలిసి తన అభినందనలు అందించారు. ఇలాంటి విభిన్నమైన సినిమాలు సుధీర్ బాబు మరెన్నో చేయాలన్నారు. మహేష్ ప్రశంసలు చిత్ర యూనిట్ కు మరింత ఆనందాన్ని కలిగించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్