Saturday, April 20, 2024
Homeస్పోర్ట్స్ఇండియాకు రెండో స్వర్ణం

ఇండియాకు రెండో స్వర్ణం

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో నేడు సోమవారం ఇండియా మరో స్వర్ణ పతకం సాధించింది. జావెలిన్ త్రో ఎఫ్-62 విభాగంలో మన ఆటగాడు సుమిత్ అంటిల్ స్వర్ణ పతకం గెల్చుకున్నాడు.  68.55 మీటర్లు విసిరిన సుమిత్ పారాలింపిక్స్ లో స్వర్ణ పతకంతో పాటు ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు. దీనితో ఇండియాకు నేడు ఐదు పతకాలు లభించాయి.

  1. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్.హెచ్.1 — అవని లేఖరా స్వర్ణం
  2. జావెలిన్ త్రో ఎఫ్-62 — సుమిత్ ఆంటిల్ స్వర్ణం
  3. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్-56 — యోగేష్ రజత పతకం
  4. జావెలిన్ త్రో ఎఫ్-46 — దేవేంద్ర ఝాఝారియా రజతం
  5. జావెలిన్ త్రో ఎఫ్-46 — సుందర్ సింగ్ గుర్జార్ కాంస్య పతకాలు సంపాదించారు.

నిన్న ఆదివారం….

  1. మహిళల టేబుల్ టెన్నిస్ —భావీనా పటేల్ రజతం
  2. పురుషుల హై జంప్ టి-47 — నిషద్ –రజతం
  3. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్-52 — వినోద్ కాంస్యం గెల్చుకున్నారు

అయితే, వినోద్ కుమార్ నిన్న గెల్చుకున్న కాంస్య పతకాన్ని సాంకేతిక కారణాలతో కోల్పోవాల్సి వచ్చింది. వినోద్ డిజేబిలిటీ క్లాసిఫికేషన్ పై పోటీదారులు అభ్యంతరాలు లేవనెత్తారు. దీనిపై  స్పందించిన నిర్వాహక కమిటీ నేడు అతని క్లాసిఫికేషన్ ను అంచనా వేసింది. కమిటీ నిబంధనలకు డిజేబిలిటీ సరిపోకపోవడంతో పోటీకి అనర్హుడిగా తేల్చారు. ఈ కారణంగా నిన్న వినోద్ గెల్చుకున్న కాంస్యం కూడా రద్దవుతుందని ప్రకటించారు.

ఇండియా ఇప్పటి వరకూ రెండు స్వర్ణాలు, నాలుగు రజత, ఒక కాంస్య పతకంతో మొత్తం ఏడు పతకాలు సాధించి పట్టికలో 25వ స్థానంలో కొనసాగుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్