Tuesday, April 16, 2024
HomeTrending Newsతెలంగాణ గురుకులాలు దేశానికి దిక్సూచి

తెలంగాణ గురుకులాలు దేశానికి దిక్సూచి

అన్ని వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందించాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారని మంత్రి కొప్పులఈశ్వర్ చెప్పారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓపెన్ స్కూల్ విద్యా సంస్థల్లో 5 వ తరగతిలో ప్రవేశాలు పొందేందుకు గాను జూలై 18వ తేదీన ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరిగింది.ఇందుకు సంబంధించిన ఫలితాలను మంత్రి కొప్పుల సోమవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మన గురుకులాలు దేశానికే దిక్సూచిగా మారాయని చెప్పారు.సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు మంచి అవకాశాలన్నింటిని అందిపుచ్చుకోవాలనే దృఢ సంకల్పంతో వీటిని తీర్చిదిద్దుతామన్నారు.ప్రవేశపరీక్షకు 74వేల 75 మంది విద్యార్థులు హాజరు కాగా,46వేల 491మందికి సీట్లు కేటాయించామని మంత్రి తెలిపారు.ఆ యా అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులకు 50%శాతానికి పైగా స్థానికంగానే సీట్లివ్వడం జరిగిందన్నారు.ముఖ్యమంత్రి తీసుకున్న ఈ మంచి నిర్ణయాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నామన్నారు.సీట్లు పొందిన బాలబాలికలకు మంత్రి ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్