Sunday, March 15, 2026
Homeసినిమాఏజెంట్ టీజర్ పై మ‌హేష్ ఏమ‌న్నారో తెలుసా?

ఏజెంట్ టీజర్ పై మ‌హేష్ ఏమ‌న్నారో తెలుసా?

యూత్ కింగ్ అఖిల్‌ హీరోగా నటిస్తున్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఏజెంట్‌. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.  ఈ భారీ  సినిమాలో అఖిల్ స‌ర‌స‌న‌ సాక్షి వైద్య న‌టించింది. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్‌ 2 సినిమా బ్యాన‌ర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఆగస్ట్‌ 12న ఈ మూవీని విడుదల చేయ‌నున్న‌ట్టుగా గ‌తంలో ప్ర‌క‌టించారు. అయితే.. క‌రోనా కారణంగా షూటింగ్ ఆల‌స్యం అవ్వ‌డం వ‌ల‌న ఏజెంట్ మూవీ రిలీజ్ వాయిదా ప‌డింది. దసరాకు వ‌స్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.  అది కూడా వాయిదా పడిందని, డిసెంబ‌ర్ లో  సినిమా విడుదలయ్యే  అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. హై ఓల్టేజ్ యాక్షన్ అండ్‌ స్పై థ్రిల్లర్‌ టీజర్‌, అఖిల్‌ లుక్స్‌ సినిమా పై అంచనాలు పెంచేసింది. ఈ టీజర్ పై సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు ప్రశంసలు కురిపించారు. ఏజెంట్ టీజర్‌ అద్భుతంగా ఉంది. విజువల్స్‌, సినిమా థీమ్‌ ఎంతో నచ్చింది. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ అని ట్విటర్‌ వేదికగా ట్వీట్‌ చేశాడు మహేష్‌ బాబు. ఈ ట్వీట్ పై అఖిల్‌ స్పందించాడు. థ్యాంక్యూ బ్రదర్‌. మీ సపోర్ట్‌, ప్రోత్సాహాం ఎంతో విలువైనది అని రీట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఏజెంట్‌ టీజర్‌ యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌తో దూసుకెళుతుంది.

Also Read : ‘ఏజెంట్’ యాక్షన్-ప్యాక్డ్ టీజర్‌ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular