Monday, June 8, 2026
HomeTrending Newsరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన సిఎం, స్పీకర్

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన సిఎం, స్పీకర్

Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు, ఎమ్మెల్యేలు,  తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

కాగా, రాష్ట్రంలో 175మంది ఎమ్మెల్యేలు, రాజ్య సభ, లోక్ సభలో కలిపి 36మంది ఎంపీలు ఉండగా అందరూ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము కే తమ మద్దతు ప్రకటించారు. ఎక్కడ క్రాస్ ఓటింగ్ కు అవకాశం లేకపోతే ఏపీ నుంచి 100 ఓట్లు ముర్ముకే దక్కనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular