Another Kutti: టాలీవుడ్ కి పరిచయమైన అందమైన భామలలో మాళవిక నాయర్ ఒకరు. ఢిల్లీలో పుట్టి .. కేరళలో పెరిగిన ఈ అమ్మాయి  అందానికి కేరాఫ్ అడ్రెస్ లా అనిపిస్తుంది. 2012లో మలయాళ సినిమాలతోనే తన కెరియర్ ను మొదలుపెట్టింది. దుల్కర్ మూవీ ‘ఉస్తాద్ హోటల్’ సినిమాతో మలయాళ ప్రేక్షకులను పలకరించిన ఆమె, 2015లో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతోనే ఇక్కడ సక్సెస్ ను అందుకుంది.

చక్కని కనుముక్కు తీరుతో ఈ అమ్మాయి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేసింది. ముఖ్యంగా ఆమె కళ్లలోని ఆకర్షణ వాళ్లను కట్టిపడేసింది. ఆ కళ్లతో ఆమె పలికించిన హావభావాలను వాళ్లు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇక తెలుగు తెరపై ఆమె జోరు కొనసాగడం ఖాయమని చాలామంది చెప్పుకున్నారు. కానీ అలా జరగలేదు. అందుకు కారణం ఆమె ఎంచుకున్న కథలు .. పాత్రలే అని చెప్పుకోవాలి. ప్రాధాన్యత లేని పాత్రలు .. అంతగా ఆడని సినిమాలు ఆమెను కాస్త వెనక్కి నెట్టాయనే చెప్పాలి.

కానీ ఇప్పుడు ఆమె తన కెరియర్ పై ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టినట్టుగా అనిపిస్తోంది. ఈ నెల 22వ తేదీన విడుదలవుతున్న చైతూ ‘థ్యాంక్యూ‘ సినిమాలో ఆమె ఒక హీరోయిన్. మంచి ప్రాధాన్యత కలిగిన పాత్రనే అనే విషయం ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక నాగశౌర్య జోడిగా ఆమె చేస్తున్న ‘ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి’ సినిమా రీసెంట్ గా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఇక ‘అన్నీ మంచి శకునములే’ ప్రాజెక్టు లైన్లోనే ఉంది. ఈ ఆర్డర్ చూస్తుంటే మాళవికకి ఇక్కడ మంచి రోజులు వచ్చినట్టే అనిపిస్తోంది కదూ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *