Saturday, January 18, 2025
Homeసినిమా'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైలర్‌ విడుదల

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్‌ విడుదల

సుధీర్ బాబు,  మోహనకృష్ణ ఇంద్రగంటి టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన కాంబినేషన్‌లో ఒకటి. వీరిద్దరూ కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి‘ అనే అద్భుతమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయిక.

ఇప్పటికే  టీజర్, పాటలు విడుదల కాగా, ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. వృత్తి రీత్యా డాక్టరైన కృతి శెట్టి సినిమాల్లో నటించడానికి అంగీకరించడం, సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్ సుధీర్ బాబు ఆమె నిర్ణయంతో సంబరంలో ఉన్నట్లుగా ట్రైలర్ ప్రారంభమైయింది. కృతికి సినిమా నటి కావాలనే కోరిక ఉన్నప్పటికీ, ఆమె తల్లిదండ్రులు దానికి పూర్తిగా వ్యతిరేకం. అంతేకాదు, సినిమా పరిశ్రమపై వారికి ద్వేషం,చెడు అభిప్రాయం. ఇలాంటి నేపద్యంలో నటి, దర్శకుడి ప్రేమకథ ఎక్కడ ముగుస్తుంది అనేది కథా సారాంశం.

సినిమాలంటే అందరికీ ఇష్టం. అయితే ఇండస్ట్రీ పై కొంతమందికి చెడు అభిప్రాయం ఉంది. ఈ అంశం కారణంగా తమ కుమార్తెలను పరిశ్రమకు పంపేందుకు తల్లిదండ్రులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇంద్రగంటి ఈ సినిమాకి కథాంశంగా ఇదే సబ్జెక్ట్‌ని ఎంచుకుని తన అద్భుత స్క్రీన్ రైటింగ్‌తో మెప్పించడంలో విజయం సాధించారు. సుధీర్ బాబు యంగ్ ఫిల్మ్ మేకర్ గా చార్మింగా కనిపించాడు, భావోద్వేగలని కూడా అద్భుతంగా చూపించాడు. నటిని కావాలని తపన పడే అమ్మాయిగా కృతి శెట్టి అందంగా వుంది. ఆమె పాత్ర కథపై ఆసక్తిని పెంచుతోంది. సుధీర్ బాబు, కృతి శెట్టి అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకున్నారు. వెన్నెల కిషోర్ వినోదాన్ని పంచారు. మిగతా నటులు తమ పాత్రలని సమర్ధవంతంగా పోషించారు.

సినిమాటోగ్రాఫర్ పిజి విందా మాస్టర్ క్రాఫ్ట్‌స్‌మ్యాన్, అతను అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇందులో వివేక్ సాగర్ సంగీతం క్లాస్‌గా వినిపించింది,. వీరిద్దరూ కలిసి మరింత మ్యాజిక్ చేశారు. చిత్రానికి సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ట్రైల‌ర్‌ప్రధాన పాత్రల‌ను ప‌రిచ‌యం చేయ‌డంతో పాటు కథలో సంఘర్షణని కూడా చూపించి ఇప్పుడు సినిమాపై అంచ‌నాలు పెంచింది.

Also Read : సెప్టెంబర్ 16న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్