Monday, June 8, 2026
Homeసినిమాశర్వానంద్ నూతన చిత్రం ప్రారంభం

శర్వానంద్ నూతన చిత్రం ప్రారంభం

హీరో శర్వానంద్  33వ  సినిమా నేడు ప్రారంభమైంది. రచయిత, దర్శకుడు కృష్ణ చైతన్య దీన్ని రూపొందిస్తున్నారు. టిజి విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది.

ఈరోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ఈ మూవీ ప్రారంభమైయింది. నిర్మాతలు చందూ మొండేటి, హను రాఘవపూడి, సుధీర్ వర్మ, యువి క్రియేషన్స్ వంశీ, విక్రమ్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ముహూర్తం షాట్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్‌ ఇవ్వగా, కృష్ణ చైతన్య స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభమవుతుంది.

రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో మరికొందరు ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనుండగా, జిమ్షీ ఖలీద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. జయశ్రీ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, విటల్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

Also Read : ఇది నా సినిమా అని జీవితాంతం చెప్పుకునేలా ఉంటుంది: శర్వానంద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular