Friday, March 29, 2024
Homeసినిమాఇది నా సినిమా అని జీవితాంతం చెప్పుకునేలా ఉంటుంది: శర్వానంద్

ఇది నా సినిమా అని జీవితాంతం చెప్పుకునేలా ఉంటుంది: శర్వానంద్

Oke Oka Jeevitham: యంగ్ హీరో శర్వానంద్ కెరీర్‌ లో మైల్ స్టోన్ లాంటి చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఇది శ‌ర్వానంద్ 30వ చిత్రం. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్‌ మాటలను అందించారు. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.

శ‌ర్వానంద్ మాట్లాడుతూ “ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉన్నది ఒకే ఒక జీవితం అందరూ ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఇప్పుడే మొత్తం మాట్లాడలేను. ఇది నా సినిమానో, శ్రీ కార్తీక్ సినిమానో కాదు. ఇది వాళ్ల అమ్మ సినిమా. సినిమా నేరేషన్ టైం నుంచి ఆమె మా వెనకాల నుంచి నడిపిస్తున్నారు. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం నాకు ఇచ్చినందుకు ప్రభుకు థాంక్స్.  ఇది లైఫ్ లాంగ్ నా సినిమా అని చెప్పుకునే సినిమా. జేక్స్ బిజోయ్ అన్ని సాంగ్స్ ఇరగొట్టాడు. ముఖ్యంగా అమ్మ పాట గురించి చెప్పాలి. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి.. 9 నెలల పాటు రాశారు. దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు మన మధ్యలేరు. కానీ పాటల్లో ఎప్పుడూ జీవించే ఉంటారు. ఈ స్టోరి చెప్పగానే అమల గారు చేస్తున్నారా అని అడిగాను. నేను ఈ పాత్రలో ఆమెను మాత్రమే ఊహించుకున్నాను. ఈ సినిమాకు ఆత్మ అమల గారి పాత్ర. ఈ పాటను రిలీజ్‌ చేయడం లేదు. ఒక చిన్న ఈవెంట్ చేసి.. కుదిరితే శాస్త్రి గారి అమ్మగారిని, అమల గారి అమ్మగారిని, మా అమ్మగారిని పిలిచి ఈ వేడుకలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం” అన్నారు.

అమల అక్కినేని మాట్లాడుతూ “ఈ సినిమాతో అందరికి అమ్మను అయిపోయాను. ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. స్టోరీ చెప్పినప్పుడు.. నేను ఈ పాత్రను చేయాలని అనుకున్నాను. మిగిలిన సినిమాలు చేసినా, చేయకపోయినా.. ఈ పాత్ర చాలు అనిపించింది. శ్రీ కార్తీక్ ఎంత కష్టపడ్డాడో అంత మంచి పేరు వస్తుంది. సినిమా కోసం పని చేసిన అందరికి థాంక్స్. తప్పకుండా ఈ సినిమా మీరు ఎంజాయ్ చేస్తారు” అన్నారు.

Also Read : శ‌ర్వానంద్‌ ‘ఒకే ఒక జీవితం’ ప్రోమో విడుద‌ల‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్