Saturday, March 7, 2026
Homeసినిమాఇంతకీ టీజరా? పోస్టరా?

ఇంతకీ టీజరా? పోస్టరా?

సూపర్ స్టార్ మహేష్ బాబు – గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం సర్కారు వారి పాట. ఇందులో మహేష్‌ సరసన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ నటిస్తుంది. మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట టీజర్ రిలీజ్ చేస్తారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. సర్కారు వారి టీమ్ అదే పనిలో ఉన్నారట. అభిమానులకు అదిరిపోయే టీజర్ అందించాలని ట్రై చేస్తున్నారని తెలిసింది. అయితే.. దుబాయ్ లో జరిగిన షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు.

ఈ షెడ్యూల్ లో చిత్రీకరించిన ఫుటేజ్ 15 నిమిషాలు ఉంటుందట కానీ.. అందులో టీజర్ కు సరిపడే ఫుటేజ్ లేదట. దీంతో 30 సెకన్ల గ్లింప్స్ ని కట్ చేయాలి అనుకుంటున్నారని సమాచారం. ఈ గ్లింప్స్ కి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. బయటకు వస్తుంది. లేదంటే.. పోస్టర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. మరి.. మహేష్‌ దేనికి ఓకే చెబుతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మే 31నే మహేష్‌ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందే క్రేజీ మూవీని ప్రారంభించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ మూవీ టైటిల్ ఆరోజు ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular