Sunday, January 19, 2025
Homeసినిమామ‌హేష్ పోస్టర్ విడుదల చేసిన ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్'

మ‌హేష్ పోస్టర్ విడుదల చేసిన ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మరో చిత్రం రూపొందనుందని ప్రకటన వచ్చిన నాటి నుంచి ఈ చిత్రంపై ఉత్సుకత ఇటు సినీ వర్గాల్లోనూ, అటు ప్రేక్షక వర్గాల్లోనూ నానాటికీ పెరుగుతూ వస్తోంది. దీనిని కొనసాగిస్తూ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్‘యూనిట్. ఇది మ‌హేష్-త్రివిక్ర‌మ్‌ల హ్యాట్రిక్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా ఈ చిత్రానికి ఎంపిక అయ్యారు. అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్  , ఛాయాగ్రాహకుడు గా ‘మధీ‘, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి స్వరాలు అందించనున్నారు.

మ‌హేష్ బాబు సరసన పూజా హెగ్డే మరోసారి జతకడుతున్నారు. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు  జరుగుతున్నాయి. ఒక స్పెష‌ల్ క్రేజ్ ఉన్న ఈ సినిమా  #SSMB28కి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని యూనిట్ తెలియజేసింది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.డి.వి. ప్రసాద్. స‌మ‌ర్ప‌ణ: శ్రీ‌మ‌తి మ‌మ‌త‌, నిర్మాత‌: సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు), ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌.

RELATED ARTICLES

Most Popular

న్యూస్