Monday, June 8, 2026
Homeసినిమా‘సర్కారు వారి పాట’ టీజర్ అదిరింది

‘సర్కారు వారి పాట’ టీజర్ అదిరింది

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సర్కారు వారి పాట టీజర్ రిలీజ్ చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ee టీజర్‌ను విడుదల చేయాల్సి ఉంది కానీ.. కొన్ని గంటలకు ముందే సర్కారు వారి పాట బ్లాస్టర్ అంటూ అర్థరాత్రి 12 గంటలకే టీజర్ రిలీజ్ చేశారు. ఇక టీజర్ విషయానికి వస్తే… ‘ఇందుమూలంగా యావత్తు ప్రజానికానికి తెలియచేయడమేమనగా….’ అంటూ మహేష్ బాబు ఎంట్రీని అద్భుతంగా చూపించారు. చాలా స్టైలీష్ గా చాలా కొత్తగా కనిపించాడు.

‘ఇఫ్ యూ మిస్ ద ఇంట్రస్ట్ యు విల్ గెట్ యువర్ డేట్…’ అని మహేష్ విలన్ గ్యాంగ్‌కి వార్నింగ్ ఇచ్చాడు. లుక్, బాడీ లాంగ్వేజ్, స్టైల్, యాక్షన్.. ఇలా అన్నింటిలో మహేష్ ని ఫ్రెష్ గా చూపించారు దర్శకుడు పరశురామ్. ఇక హీరోయిన్ విషయానికి వస్తే.. ‘సర్ పడుకునే ముందు ప్రతి రోజు దిష్టి తీయడం మర్చిపోకండి’ అంటూ మహేష్ గ్లామర్ గురించి కీర్తి సురేష్ చెప్పడం బాగుంది. ఇక లాస్ట్ లో ‘ఏవోయ్ కిషోర్.. ఓ ఐదారు మూరలు ఉండవవి’ అంటూ కీర్తి సురేష్ జడకు పెట్టుకున్న పూల పై పంచ్ వేశారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అదరగొట్టేశాడు.

ఈ టీజర్ ను ఇలా రిలీజ్ చేశారో లేదో.. అలా యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళుతుంది. టీజర్ రిలీజ్ చేసిన తక్కువ టైమ్ లోనే 7.2 మిలియన్ వ్యూస్, 350 కే లైక్స్ తో సరికొత్త రికార్డులు సాధించే దిశగా పరుగులు పెడుతుంది. టీజర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. అదిరింది. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను పెంచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular