మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇప్పటి వరకు అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. విజయేంద్రప్రసాద్ ఈ మూవీ కోసం పవర్ ఫుల్ యాక్షన్ అడ్వెంచెరస్ స్టోరీ రెడీ చేశారట. మహేష్ పుట్టినరోజైన ఆగష్టు 9న ఈ భారీ, క్రేజీ మూవీని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ భారీ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ నిర్మించనున్నారు.
ఇదిలా ఉంటే.. రాజమౌళి తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ముందు వర్క్ షాపు నిర్వహిస్తుంటారు. హీరో ఎవరైనా సరే.. ఆ వర్క్ షాపుకి రావాల్సిందే. ఇప్పుడు మహేష్ బాబుతో చేయనున్న మూవీ కోసం కూడా వర్క్ షాపు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం మూడు నెలల పాటు వర్క్ షాపు ప్లాన్ చేశారట. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ ప్రొగ్రామ్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే.. ఈ వర్క్ షాపు ఇక్కడే ఉంటుందా..? విదేశాల్లో ఉంటుందా..? అనేది తెలియాల్సివుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ట్రైనింగ్ షెడ్యూలు మారదని తెలుస్తోంది.
అందుకే.. మహేష్, త్రివిక్రమ్ సినిమాను నవంబర్ కి పూర్తి చేయాలని పక్కాగా షెడ్యూళ్లు వేసారని తెలిసింది. మహేష్ గ్యాప్ తీసుకునే టైమ్ లో కూడా షూటింగ్ పెట్టి, ఆయన లేని సీన్లు తీస్తున్నారు. ప్రస్తుతం హైదారబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అక్టోబర్ చివరికి టాకీ మొత్తం పూర్తి చేసి.. నవంబర్ లో పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆతర్వాత నుంచి రాజమౌళితో చేయనున్న సినిమాను స్టార్ట్ చేయనున్నారు. పాన్ వరల్డ్ మూవీగా రూపొందే ఈ సినిమాకి హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు వర్క్ చేయనున్నారు.