Sunday, May 19, 2024
Homeసినిమాప్రభాస్ ప్రాజెక్ట్ కే టైటిల్ ఇదేనా..?

ప్రభాస్ ప్రాజెక్ట్ కే టైటిల్ ఇదేనా..?

ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. ఈ భారీ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ తో పాటు బిగ్ బి అమితాబ్, యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ నటిస్తుండడంతో ఈ సినిమా పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక కథానాయికలుగా బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పడుకునే, దిశా పటానీ నటిస్తున్నారు.

వర్కింగ్ టైటిల్ ‘ప్రాజెక్ట్ కే’  పెట్టిన ఈ సినిమాకు అసలు టైటిల్  ఏంటనేది సస్సెన్స్ గా మారింది. ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కల్కి అంటూ ప్రచారం జరిగింది. అయితే.. ఈ సినిమా కాన్సెప్ట్ అనుగుణంగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ ప్రచారంలోకి వచ్చిది. మరి ఆ టైటిల్ ఏంటంటే.. ‘ప్రాజెక్ట్ కాలచక్ర’ అట. అలాగే ఈ సినిమా భవిష్యత్ కు సంబంధించిన కాన్సెప్ట్ తో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ నెల 20న ఈ మూవీ మోషన్ పోస్టర్ అండ్ టైటిల్ అనౌన్స్ చేయనున్నారు.

ఓ వైపు షూటింగ్ జరుగుతూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ.. సమ్మర్ లో విడుదల అవుతుందని ప్రచారం జరుగుతుంది. దీంతో ప్రాజెక్ట్ కే వచ్చేది సంక్రాంతికా..? లేక సమ్మర్ కా..? అనేది సస్పెన్స్ గా మారింది. ఈ పాన్ వరల్డ్ మూవీ పై హాలీవుడ్ దృష్టి పడేలా చేయడం కోసం టైటిల్ లాంచ్ ఈవెంట్ అమెరికాలో ప్లాన్ చేశారు. మరి.. ఈ పాన్ వరల్డ్ మూవీతో ప్రభాస్ చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్