Tuesday, June 16, 2026
HomeసినిమాGuntur Karam: మహేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్

Guntur Karam: మహేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఆగష్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు. అభిమానులకు పండగరోజు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజుకు మహేష్‌ బాబు కొత్త సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇస్తుంటారు. ఈ సంవత్సరం ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి.

అయితే.. థమన్ రెడీ చేసిన ఫస్ట్ సింగిల్ నచ్చలేదో.. లేక వేరే కారణం ఏదైనా ఉందో ఏమో కానీ.. బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ సింగిల్ కాకుండా.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.   ఈ పోస్టర్ లో మహేష్ బాబు లుంగీ కట్టిన మాస్ లుక్ లో అదరగొట్టాడు. ఈ సినిమా మాస్ మూవీ అని గ్లింప్స్ ద్వారా తెలియచేశారు. ఇప్పుడు పోస్టర్ ద్వారా మరోసారి ఇది మాస్ మూవీ కన్ ఫర్మ్ చేశారు. ఈ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో గుంటూరు కారం సినిమా పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. నవంబర్ కి షూటింగ్ కంప్లీట్ చేసి.. సంక్రాంతికి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular