Sunday, February 23, 2025
Homeసినిమాసంక్రాంతి నుంచి ఉగాదికి మారిన ‘సర్కారువారి పాట’

సంక్రాంతి నుంచి ఉగాదికి మారిన ‘సర్కారువారి పాట’

Mahesh Latest Film Sarkaru Vaari Paata Postponed To Ugadi :

సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’ స్పెయిన్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. పరుశురామ్ దర్శకత్వంలో రాబోతోన్న  చిత్రానికి సంబంధించిన విడుదల తేదీ మారింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ సినిమాను ఉగాది పండుగ సందర్బంగా ఏప్రిల్ 1న విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌కు రాబోతోన్నట్టు ప్రకటించిన పెద్ద చిత్రం ఇదే. ఈ సినిమాకు వేసవి సెలవులు కలిసి రానున్నాయి. హాలీడే సమయంలో విడుదలైన మ‌హేష్ బాబు పోకిరి, భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

ఇప్పటికే రిలీజైన‌ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగ‌వంతం చేయ‌నుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

Must Read :‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్ విడుదల చేసిన మహేష్ బాబు

 

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్