Saturday, April 20, 2024
Homeసినిమా‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్ విడుదల చేసిన మహేష్ బాబు

‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్ విడుదల చేసిన మహేష్ బాబు

సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70MM ఎంటర్టైన్మెంట్ పతాకం పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా అన్నీ సమపాళ్లలో శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

‘శ్రీదేవి నాది.. నాదే..’
‘నా శ్రీదేవికి పెళ్లి చేస్తార్రా..?’

అంటూ సుధీర్ బాబు చెప్పే డైలాగులకు మంచి స్పందన వస్తుంది. ఇండియా వ్యాప్తంగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ కు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్  ఈ ‘శ్రీదేవి సోడా సెంటర్’ హక్కులను సొంతం చేసుకున్నారు.

‘శ్రీదేవి సోడా సెంటర్’ను భారీగానే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు లక్ష్మణ్. ఈయన ఈ మధ్యే విడుదలై బ్లాక్‌బస్టర్ అయిన జాతి రత్నాలు సినిమాను లక్ష్మణ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్