Sunday, March 8, 2026
Homeసినిమాటీజర్ గురించి.. సర్కారి వారి క్లారిటీ

టీజర్ గురించి.. సర్కారి వారి క్లారిటీ

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు – గీత గోవిందం ఫేమ్ పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మహేష్ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ చేయడం కానీ.. పోస్టర్ రిలీజ్ చేయడం కానీ చేసేవారు. ఈ సంవత్సరం సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి టీజర్ కానీ.. పోస్టర్ కానీ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై మహేష్ టీం క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా టీజర్ లేదా పోస్టర్ విడుదల చేయడం లేదని ట్విట్టర్ వేదికగా మహేష్ టీం వెల్లడించింది. సినిమా అప్‌డేట్‌ గురించి ఎవరూ కూడా అనధికారికంగా, అవాస్తవాలను దయచేసి సృష్టించవద్దని కోరింది. ఏ అప్‌డేట్ అయినా అఫీషియల్ గా ప్రకటిస్తామని, అప్పటివరకూ వెయిట్ చేయాలని టీమ్‌ విజ్ఞప్తి చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular