Saturday, July 27, 2024
HomeTrending Newsబ్లాక్ ఫంగస్ నివారణకు చర్యలు : మంత్రుల కమిటి

బ్లాక్ ఫంగస్ నివారణకు చర్యలు : మంత్రుల కమిటి

బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కరోనా నివారణకై ఏర్పాటైన గ్రూప్ అఫ్ మినిస్టర్స్ (జిఓఎం) అధికారులకు నిర్దేశించింది. బ్లాక్ ఫంగస్ పై ప్రజల్లో భయం పోగొట్టడానికి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని, ఈ వ్యాధి సోకిన రోగులకు వైద్యం నిరాకరించే హాస్పిటల్స్ పై కఠినంగా వ్యవహారించాలని సమావేశం నిర్ణయించింది. మంగళగిరి ఏపిఐఐసి బిల్డింగ్ 6వ ఫ్లోర్ లో  గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు అధ్యక్షతన గురువారం జరిగింది.

కరోనా కష్ట కాలంలో ప్రాణాలు తెగించి వైద్యసేవలదిస్తున్న  డాక్టర్స్, వైద్య సిబ్బంది, అధికారులు, శానిటేషన్ సిబ్బంది, ఆశా వర్కర్స్, వాలంటీర్స్ అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని మంత్రుల కమిటి ప్రత్యేకంగా అభినందించింది. ప్రైవేటు హాస్పిటల్స్ ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా  అమలు చేయాలని.  50% బెడ్లు ఆరోగ్యశ్రీ రోగులకు కేటాయించాలని స్పష్టం చేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ పై చర్యలకు వెనుకాడ వద్దని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించిన విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.

ఆక్సిజన్ వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిట్ జరగాలని, ప్రతి హాస్పిటల్ లో కరోనా పెషేంట్స్ కు ఆక్సిజన్ నిల్వలు సక్రమంగా ఉండేలా చూడాలని సమావేశం అధికారులకు సూచించింది.  రెమిడీసివర్ ఇంజక్షన్స్ లో బ్లాక్ లో విక్రయిస్తే కఠినంగా వ్యవహారించాలని,  ఇంజక్షన్స్ అన్ని హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.

ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, హోం శాఖ మంత్రి  మేకతోటి సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, డీజీపీ గౌతమ్ సవాంగ్,  సీనియర్ అధికారులు ఎం టి కృష్ణ బాబు, కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్