Saturday, April 20, 2024
Homeస్పోర్ట్స్తొందరేమీ లేదు : జోఫ్రా ఆర్చర్

తొందరేమీ లేదు : జోఫ్రా ఆర్చర్

హడావుడిగా క్రికెట్ ఆడేందుకు తాను అత్యుత్సాహం చూపడం లేదని ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ స్పష్టంచేశాడు. గాయం పూర్తిగా నయమైన తరువాతే ఆట తిరిగి మొదలుపెదతానని వెల్లడించాడు. గత శుక్రవారం నాడు మే 21న  తన కుడి మోచేతికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆర్చర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.

టి20 వరల్డ్ కప్, ఆస్ట్రేలియాతో జరిగే కీలకమైన యాషెస్ సిరీస్ నాటికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఒకవేళ గాయం పూర్తిగా మానితే అంతకు ముందే ఇండియాతో జరిగే ఐదు టెస్టుల సిరీస్ ఆడే విషయమై ఆలోచిస్తానని చెప్పాడు.

కొన్ని రోజులు ఆటకు దూరం కావాల్సి రావడం తననేమీ బాధించడం లేదని, ఇప్పుడు సరైన విశ్రాంతి తీసుకుంటే అదనంగా మరి కొన్ని సంవత్సరాలు ఆట కొనసాగించడానికి వీలుంటుందని…. పూర్తిగా ఫిట్ నెస్ సాధించక ముందే ఆడడం వల్ల పెద్దగా ఫలితం ఉండదని జోఫ్రా అన్నాడు.

ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇండియాలో పర్యటించిన ఇంగ్లాండ్ జట్టులో టి-20, టెస్ట్ మ్యాచ్ లు ఆడిన జోఫ్రా మోచేతి నొప్పితో వన్డే సిరీస్ కు దూరమయ్యాడు.  ఈ కారణంతోనే ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న జోఫ్రా ఈ సీజన్ కు దూరమయ్యాడు. 26 సంవత్సరాల యువ పేసర్ అతి త్వరలో తన వైవిధ్యమైన బౌలింగ్ తో ఆకట్టుకోవాలని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్