Wednesday, June 26, 2024
Homeసినిమామ‌హేష్, త్రివిక్ర‌మ్ మూవీ ముహుర్తం ఫిక్స్

మ‌హేష్, త్రివిక్ర‌మ్ మూవీ ముహుర్తం ఫిక్స్

Mahesh-Trivikram: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో ‘అత‌డు’, ‘ఖ‌లేజా’ చిత్రాలు రూపొంద‌డం.. ఆ రెండు చిత్రాలు ఇద్ద‌రికీ మంచి పేరు తీసుకురావ‌డం తెలిసిందే. దీంతో వీరిద్ద‌రూ క‌లిసి మ‌రో సినిమా చేస్తే.. చూడాల‌ని అభిమానులు ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నారు. అది ఇప్ప‌టికి సెట్ అయ్యింది. మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో మూవీని ఆమ‌ధ్య అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. అయితే.. క‌రోనా కార‌ణంగా సెట్స్ పైకి వెళ్ల‌డం ఆల‌స్యం అయ్యింది.

లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఫిబ్ర‌వ‌రి 3న హైద‌రాబాద్లో ఈ చిత్రాన్ని సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ప్రారంభించ‌డానికి ముహుర్తం ఫిక్స్ చేశార‌ని తెలిసింది. ఇక మార్చి లేదా ఏప్రిల్‌లో రెగ్యులర్‌ షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డే కథానాయికగా న‌టించ‌నుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే త్రివిక్రమ్, థమన్ మ్యూజిక్ సెషన్స్ మొదలుపెట్టారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై చిన‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్