Wednesday, May 8, 2024
Homeసినిమా'భీమ్లా నాయ‌క్' మ‌ళ్లీ వాయిదా?

‘భీమ్లా నాయ‌క్’ మ‌ళ్లీ వాయిదా?

Again postpone?: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, క్రేజీ స్టార్ రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్లో రూపొందిన భారీ, క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ భీమ్లా నాయ‌క్. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాష‌ణ‌లు అందించ‌డం విశేషం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయాలి అనుకున్నారు మేక‌ర్స్.

అయితే… ఆర్ఆర్ఆర్ మూవీ కోసం భీమ్లా నాయ‌క్ వాయిదా ప‌డింది. ఆత‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 25న భీమ్లా నాయ‌క్ విడుద‌ల అని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఫిబ్ర‌వ‌రి 25న కూడా భీమ్లా నాయ‌క్ రావ‌డం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కార‌ణం ఏంటంటే.. శర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రం ఆడ‌వాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా అధికారికంగా ప్ర‌క‌టించారు. భీమ్లా నాయ‌క్ ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ ఉంటే.. శ‌ర్వానంద్ మూవీని విడుద‌ల చేయ‌రు.

కాబ‌ట్టి భీమ్లా నాయ‌క్ వాయిదా ప‌డ‌డం అనేది క‌న్ ఫ‌ర్మ్ అని తెలుస్తుంది. నిజానికి ఫిబ్రవరి 25 నాటికి పరిస్థితులన్నీ చక్కబడేలా ఉన్నాయి. అయినప్పటికీ.. ఎందుకో భీమ్లానాయక్ ను మరోసారి పోస్ట్ పోన్ చేసినట్టున్నారు. ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నార‌నిపిస్తుంది. అయితే… భీమ్లా నాయ‌క్ వాయిదా గురించి మేక‌ర్స్ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. మ‌రి… త్వ‌ర‌లోనే కొత్త విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్