Tuesday, June 9, 2026
HomeTrending Newsఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం

ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం

రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా విద్య సంస్థలలో ఏర్పాట్లు చేయటం యాజమాన్యాల బాధ్యత అని, ఉల్లంఘించిన వారిపై  చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular